పెళ్లైన వారానికే వధువు సూసైడ్.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఘటన

పెళ్లైన వారానికే వధువు సూసైడ్.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఘటన

నర్సాపూర్, వెలుగు: పెళ్లైన వారం రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో బుధవారం జరిగింది. నర్సాపూర్ మండలం హద్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతికి, చిన్నచింతకుంటకు చెందిన చారితో గత నెల 25న వివాహం జరిగింది. వారం రోజులు గడవకముందే స్వాతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.